
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ డైరెక్టర్
లంచం తీసుకుంటూ ఉన్నతాధికారి పట్టుబడ్డ ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావును లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఈ అధికారి, ఎరువుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ సిబ్బంది పకడ్బందీగా నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు. ఎరువుల దుకాణం నిర్వహణకు సంబంధించిన అనుమతుల విషయంలో సాయం చేస్తానని హామీ ఇచ్చిన నరసింహారావు, వ్యాపారవేత్త నుంచి రూ.25 వేల లంచం కోరాడు. దీనిపై విసిగిపోయిన వ్యాపారవేత్త ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.