EntertainmentHyderabadPoliticalTelangana

'పుష్ప 2' ప్రీమియర్‌ షో.. తొక్కిసలాటలో మహిళ మృతి

'పుష్ప 2' ప్రీమియర్‌ షో.. తొక్కిసలాటలో మహిళ మృతి

‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో.. తొక్కిసలాటలో మహిళ మృతి

హీరో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (39) మృతి చెందింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

రాత్రి 9.30 గంటల ప్రీమియర్‌ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్‌, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్‌, సన్వీక (7) దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి సంధ్య థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో.. హీరో అల్లు అర్జున్‌ సంధ్య థియటర్‌ వద్దకువచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు.

అల్లు అర్జున్‌ థియేటర్‌లోకి వెళ్లాక.. అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో రేవతి, ఆమె కుమారుడు, మరో వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయారు.

పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి.. ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే రేవతి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

ఆమె కుమారుణ్ని మరింత మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. కాగా.. స్పృహతప్పిన బాలుడు శ్రీతేజ్‌కు పోలీసులు సీపీఆర్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button