
డాక్టర్స్ డే .. డాక్టర్ నిర్లక్ష్యానికి పసికందు మృతి
పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ డే రోజున పసికందు మృతి.
డాక్టర్ నిర్లక్ష్యం వహించారంటూ బంధువుల ఆరోపణ
ప్రైవేట్ హాస్పటల్ పై చూపించే శ్రద్ధ పేషంట్లపై చూపిస్తే బాగుండేది
నొప్పులు తట్టుకోలేక ఆపరేషన్ చేయమని ప్రాధేయపడిన పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది
డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్
పాల్వంచ పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు
ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీలో ఉంటూనే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు చేస్తున్న డాక్టర్
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/పాల్వంచ ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జూలై 02,
వైద్యో నారాయణ హరి అని వైద్యుని దేవుడితో పోలుస్తూ స్మరించుకునే రోజున పాల్వంచ పట్టణం లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ నిండు గర్భిణీ మనోవేదన పలువురిని శ్లోక సముద్రంలో ముంచింది.
లక్ష్మీదేవి పల్లి మండలం తోక భాంధల గ్రామానికి చెందిన కరుణ (23) ప్రసవం కోసం వచ్చిన గర్భిణీని పలు విధాలుగా ఇబ్బందికి గురి చేస్తూ నొప్పులు వస్తున్నాయని తట్టుకోలేక ఆపరేషన్ చేయమని రెండు చేతులు జోడించి ప్రాధేయపడిన కనికరించని డాక్టర్ ఆసుపత్రి సిబ్బంది. ఆరోగ్యంగా ఉన్న పసికందు మరికొద్ది సేపట్లో ప్రసవించవలసి ఉండగా నిర్జీవంగా ఆ బిడ్డను తల్లికి అప్పగించారు.
తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని మానిటరింగ్ చేస్తూ నార్మల్ డెలివరీ చేయాలని చెప్పి డాక్టర్ అనూష ప్రభుత్వ ఆసుపత్రి నుండి బయటికి వెళ్లారని తరువాత నిండు గర్భిణీ అయిన కరుణాకు నొప్పులు రావడంతో భరించలేక తల్లడిల్లిన స్థితిలో హడావుడి చేసి ఆపరేషన్ ధీయేటర్ కు తీసుకెళ్లి బిడ్డ చనిపోయాడు అని బంధువులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. ఆపరేషన్ కి స్ట్రక్చర్ పై తీసుకు వెళుతున్న ఆయాలు డబ్బులు డిమాండ్ చేయడం కోసమేరుపు.
ఇదేమిటని బంధువులు ప్రశ్నించగా నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించామని తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేశామన్నారు. కానీ పసికందు ప్రాణాలను కాపాడలేకపోయామని పలు కారణాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
కరుణ బంధువులు డాక్టర్ను నిలదీయగా సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరగవని ఎక్కడో ఒకటి ఇలాంటి పరిస్థితి జరుగుతుందని సినిమాలో చెప్పిన రీతిగానే నిజజీవితంలో కూడా తెలియజేసిన డాక్టర్లు అందుకు మా బాధ్యత కాదంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారంటూ బంధువులు ఆరోపించారు.
గర్భిణీ స్త్రీ ప్రసవ నొప్పులు తట్టుకోలేక ఆపరేషన్ చేయమని ప్రాధేయపడిన డాక్టర్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, జాగ్రత్త వహించి ఉంటే బిడ్డ చనిపోయేవాడు కాదని, డాక్టర్ నిర్లక్ష్యంతో తల్లికి కూడా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.9 నెలలు బిడ్డను మోస్తూ బిడ్డకు జన్మను ఇవ్వాలని ఎంతో ఆశతో వచ్చిన వారికి నిరాశ ఎదురయింది.
నిర్జీవంగా ఉన్న శిశువును వారికి బహుమతిగా ఇచ్చారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ ఆసుపత్రికి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇటువంటి సంఘటనలు మరల చోటు చేసుకోకుండా డబ్బు ఉన్నవారికి లేనివారికి ఒకే విధంగా వైద్యం చేయాలని, పసికందు మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన స్టేషన్ సిబ్బంది. బుధవారం నిర్జీవ శిశువును పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. చనిపోయిన శిశువును తీసుకొని తిరుగు ప్రయాణమైన బంధువులు.
భద్రాద్రి జిల్లా అంటేనే గిరిజన జిల్లా అటువంటి జిల్లాలో గిరిజనులకు అడుగడుగున అన్యాయమే జరుగుతుంది. కలెక్టర్ భార్య ఇక్కడ డెలివరీ అయింది మనల్ని కూడా మంచిగానే చూస్తారని ఆశతో ఇక్కడికి వచ్చిన వారికి చేదు అనుభవం ఎదురయింది.
ఉన్నవారికి ఒక తీరుగా లేని వారికి ఒక తీరుగా ఇక్కడ చూస్తారు అని నిరూపించిన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది. ఏది ఏమైనాపటికి ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా డాక్టర్ పై హాస్పిటల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న బంధువులు స్నేహితులు.
ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే డాక్టర్లు మాస్టర్ పడి వారి ప్రైవేట్ హాస్పటల్ కు వెళ్తున్నారని డ్యూటీలో ఉండి వారి ప్రైవేట్ ఆసుపత్రి పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని. దాన్లో భాగంగానే చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తున్న బాధితులు.