
తెలంగాణలో 13 పొలిటికల్ పార్టీలకు ఈసీ షాక్..
వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు
రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం నుంచి రాజకీయ పార్టీగా గుర్తింపు పొంది గత ఆరు సంవత్సరాలుగా ఏ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను రాజకీయ పార్టీల జాబితాల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు మీ పార్టీల పేరును రిజిస్టర్ పార్టీల జాబితా నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలంటూతెలంగాణలోని 13 పొలిటికల్ పార్టీలకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షో కాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు ఈ 13 పార్టీలకు నోటీసులు ఇవ్వాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. పార్టీల పేరుతో దినపత్రికల్లో ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటు సంబంధింత పార్టీని జాబితా నుంచి తొలగించాలా వద్దా అనే దానిపై స్పష్టమైన సిఫార్సులతో కూడిన ప్రతిపాదనలను ఈ నెల 10వ తేదీ లోపు సమర్పించాలని ఆదేశించింది. జిల్లా అధికారుల నుంచి వచ్చే నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న పార్టీల వివరాలు:
1.తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ (పార్టీ కార్యాలయం ఉన్న జిల్లా హన్మకొండ)
2.ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ (హైదరాబాద్)
3.జాగో పార్టీ (హైదరాబాద్)
4.నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (హైదరాబాద్)
5.తెలంగాణ లోక్ సత్తా పార్టీ (హైదరాబాద్)
6.తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం (హైదరాబాద్)
7.యువ పార్టీ (హైదరాబాద్)
8.బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే) (మేడ్చల్ మల్కాజిగిరి)
9.తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ (మేడ్చల్ మల్కాజిగిరి)
10.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ(రంగారెడ్డి)
11.జాతీయ మహిళా పార్టీ (రంగారెడ్డి)
12.యువ తెలంగాణ పార్టీ(రంగారెడ్డి)
13.తెలంగాణ ప్రజా సమితి (కిషోర్, రావు, కిషన్) (వరంగల్