
ప్రతి నాయకునికి క్రమశిక్షణ ఎంతో ముఖ్యం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖర్గే పర్యటన విజయవంతం పై కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం
సి కె న్యూస్ ప్రతినిధి
రాజకీయాల్లో ఉండాలనుకున్న ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్త కు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అధ్యక్షతన పట్టణ,మండల,గ్రామ బూత్ స్థాయి అధ్యక్షులతో మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటన విజయవంతం పై దిశా నిర్దేశ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామి రెడ్డి, ఖమ్మం జిల్లా ఇన్చార్జులు టిపిసిసి మాజీ అధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీ చక్కిలం రాజేశ్వర్ రావు, దైద రవీందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ….. ఏ స్థాయి నాయకుడైన ప్రజాభిమానం పొందాలంటే ముందుగా క్రమశిక్షణ అలవర్చుకోవాలని క్రమశిక్షణ లేకుండా ఏ వ్యవస్థలోనైనా రాణించడం కష్టమని తెలిపారు. జై భీం, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ రానున్నారని తెలియజేశారు.
ఖమ్మం జిల్లా నుండి అన్ని నియోజక వర్గాల్లో పట్టణ స్థాయి నుండి బూత్ స్థాయి అధ్యక్షులు వరకూ ఒకరికి ఒకరు సమన్వయ పరచుకొని జిల్లా నుండి భారీగా తరలి ఖర్గే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. రాజ్యాంగ ఆవశ్యకతను మారుమూల గ్రామాల్లోకి చేరవేయడమే లక్ష్యంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జై భీమ్, జై బాపు జై సంవిధాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే పార్టీలో కొత్తగా కార్యవర్గ కమిటీలను కూడా నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా నుండి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని అత్యధిక మంది కార్యకర్తలు హాజరయ్యే విధంగా డివిజన్ బూత్ స్థాయి అధ్యక్షులు కృషి చేయాలని తెలిపారు.
అంతేకాకుండా నేడు రాష్ట్రంలో బీఆర్ఎస్ తన మనుగడను కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని అందుకు కోసం కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు దిగిందని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ లపై బీర్ఎస్ చేసే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సెంటిమెంట్ తో మరో మారు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నేడు తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు.
అనంతరం ఎంపీ రఘురామిరెడ్డి, టీపీసీసి మాజీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ రెడ్డి, శ్రీ చక్కిలం రాజేశ్వర్ రావు, దైద రవీందర్ లు మాట్లాడుతూ…. ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అని రాష్ట్రంలో ఏ జిల్లా లో రాని మెజారిటీ ఖమ్మం జిల్లా నుండే వచ్చిందని అదే ఉత్సాహంతో 4వ తేదీన హైదరాబాద్ లో జరిగే ఖర్గే పర్యటన విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ లు మాట్లాడుతూ జై బాపు జై భీమ్ జై సంవీధాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నామని దాన్లో భాగంగానే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాదులో పర్యటించనున్నారని అన్నారు. పట్టణ,డివిజన్, మండల, గ్రామ బూతు స్థాయి అధ్యక్షులు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు మాజి శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుమ్మూరు దయాకర్ రెడ్డి, ఖమ్మం బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్, జిల్లా అనుబంధ సంఘ అద్యక్షులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, సయ్యద్ గౌస్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి సంతోష్,మిక్కిలినేని నరేంద్ర, సాధు రమేష్ రెడ్డి,నగర ఓబీసీ, ఐ యన్ టి యు సి, మైనారిటీ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్,షేక్ అబ్బాస్, జిల్లా లోని అన్ని మండలాల నుండి విచ్చేసిన బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.