
అక్కా నీ బిడ్డ ఆరోగ్య బాధ్యత నాది…!
కూసుమంచి : మంచం మీద అచేతన స్థితిలో ఉన్న పరశురాం కూతురు సింధు ఆరోగ్య పరిస్థితి గురించి సింధు తల్లి లలితను అడిగి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలుసుకున్నారు.
కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ధర్మతండాలో ఇటీవల మృతి చెందిన పరుశరామ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పరశురాం కుమార్తె ఆరోగ్య పరిస్థితిని అతని భార్య లలితను అడిగి తెలుసుకున్నారు. మంత్రి ముందు లలిత కన్నీటి పర్యాంతమై తన బాధను చెప్పుకున్నారు.
వెంటనే మంత్రి పొంగులేటి స్పందించి ఎంపీ రఘురాం రెడ్డి, తాను కలిసి స్వయంగా హైదరాబాద్ హాస్పిటల్ కి వచ్చి డాక్టర్ల తో మాట్లాడి వైద్యం చేపిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సీఎం రిలీఫ్ పండ్ బిల్లులన్ని మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు. అధైర్య పడకు అక్కా నేను అండగా ఉంటానని చూసుకుంటనని హామీ ఇచ్చారు.