
ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో లాయర్లకు యూనిఫాం క్లాత్ కిట్ల పంపిణీ
కొత్తగూడెం బార్ అసోసియేషన్ బాధ్యులకు అందజేసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాది స్వామి రమేష్
ఖమ్మం: బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు.. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిద్ధం చేసిన యూనిఫామ్ క్లాత్ కిట్లను కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాది, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు స్వామి రమేష్ కుమార్ తో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లాయర్లకు శుక్రవారం నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు, ఉద్యోగులకు ఎంపీ ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ బాధ్యులు లక్కినేని సత్యనారాయణ,కోనా చంద్రశేఖర్ గుప్తా, ఖమ్మం బాధ్యులు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.