AdilabadPoliticalTelangana

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష!

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష!

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష!

Web desc : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు తమ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమకు రావాల్సిన స్టైపెండ్‌ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలకు రూ.29,972 చెల్లించాల్సి ఉండగా కేవలం 5వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.

అదేవిధంగా నిరాహార దీక్షలో పాల్గొంటున్న రోజులకు కూడా జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, లేనట్లయితే దశలవారీగా ఆందోళన ఉదృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button