
మహిళా స్వయం సహాయక సంఘాలకు సర్కారు భారీ గుడ్ న్యూస్
రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల
మహిళా స్వయం సహాయక సంఘాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుభవార్త చెప్పింది. ప్రభుత్వం చెప్పిన మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేసింది.
మొత్తం రూ.344 కోట్లు విడుదల చేయగా, ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించారు.
ఈ నిధులను సోసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) ద్వారా జూలై 12 నుంచి 18 తేదీల మధ్య మహిళా సంఘాల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులను పంపిణీ చేయనున్నారు.
ఇది మాత్రమే కాదు… మహిళా సంఘాల కోసం అదనంగా ప్రమాద భీమా, లోన్ భీమా చెక్కులు కూడా ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ చర్యలన్నీ మహిళల ఆర్థిక స్వావలంబనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో, శాశ్వతమైన జీవనోపాధి అవకాశాలు సృష్టించడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.