NationalNotificationPolitical

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రైల్వేలో 50 వేల ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..!

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రైల్వేలో 50 వేల ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..!

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రైల్వేలో 50 వేల ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..!

నిరుద్యోగులకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇప్పటికే 9వేలకు పైగా నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపింది.

ఇప్పటికే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్) 9,000 నియామకాలు పూర్తి చేసిన రైల్వే.. రాబోయే రోజుల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది.

భారీ రిక్రూట్‌మెంట్‌
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) ఇప్పటికే నియామక ప్రక్రియను ముమ్మరం చేశాయి. 2024 నవంబర్ నుంచి ఇప్పటివరకు, వివిధ నోటిఫికేషన్లలోని 55,197 ఖాళీల భర్తీ కోసం దాదాపు 1.86 కోట్ల మంది అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBTs) నిర్వహించాయి.

2024 వార్షిక క్యాలెండర్ ప్రకారం.. రైల్వే ఇప్పటికే 1,08,324 ఖాళీల భర్తీకి 12 నోటిఫికేషన్లు విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా మరో 50,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రైల్వే రిక్రూట్‎మెంట్ బోర్డు (ఆర్ఆర్‎బీ) ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంది. టెక్నికల్, నాన్-టెక్నికల్, మినిస్టీరియల్, లెవల్-1, ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

రైల్వే శాఖ. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ ప్రాంతంలోని ఖాళీలు, నోటిఫికేషన్ల వివరాల కోసం అధికారిక ఆర్ఆర్‎బీ వెబ్‌సైట్‌లను చెక్ చేయాలి.

అభ్యర్థుల ఇళ్లకు దగ్గర్లోనే పరీక్ష కేంద్రాలను కేటాయించడానికి ప్రయత్నిస్తున్నామని ఆర్ఆర్ బీ పేర్కొంది. మహిళా అభ్యర్థులు, దివ్యాంగులు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా దగ్గర్లోనే ఎగ్జామ్ సెంటర్లను కేటాయిస్తామంది.

ఉద్యోగాల వివరాలు, అర్హతలు, వేతనం, వయోపరిమితి వంటి వివరాలను నోటిషికేషన్లో స్పష్టంగా తెలియజేస్తామని పేర్కొంది ఆర్ఆర్‎బీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలో అభ్యర్థుల సౌకర్యాలకు, పరీక్షల పారదర్శకతకు రైల్వే పెద్దపీట వేస్తోంది.

మహిళలు, దివ్యాంగులైన (PwBD) అభ్యర్థులు ఇబ్బంది పడకుండా, వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను కేటాయించారు.అభ్యర్థుల గుర్తింపు కోసం, దేశంలోనే తొలిసారిగా భారీ స్థాయిలో ఆధార్ ఆధారిత E-KYC విధానాన్ని 95% విజయవంతంగా అమలు చేశారు.

పరీక్షల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మోసాలు జరగకుండా, అన్ని పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్ జామర్లను ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ తీసుకుంటున్న ఈ చర్యలు నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి.

పటిష్ఠమైన ప్రణాళికతో, పారదర్శకమైన విధానాలతో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భారతీయ రైల్వే సిద్ధంగా ఉంది. రైల్వే కొలువు సాధించాలని కలలు కంటున్న అభ్యర్థులకు ఇది నిజంగా ఒక సువర్ణావకాశం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button