
బీఆర్ఎస్ MLA మాగంటి గోపినాథ్ కన్నుమూత
బిఆర్ఎస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం(ఈరోజు) ఉదయం 5గంటలకు కన్నుమూశారు. గురువారం గుండెపొటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని AIG ఆసుపత్రికి తరలించారు
మూడు రోజులుగా మాగంటి గోపినాథ్ వెంటిలేటర్ పై చికిత్స పొందతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్తానం మొదలైంది. 2018లో టీఆర్ఎస్‌లో చేరారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.
మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యవత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై 9 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారే విజయాన్ని రుచిచూశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పీ విష్ణువర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్ నుంచే పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ తెలంగాణే శ్వాసగా పనిచేసే బీఆర్‌ఎస్ జెండాను రెపరెపలాడించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగారు
మాగంటి గోపీనాథ్ అకాల మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం
జూబ్లీహిల్స్ శాసనసభ్యులు, బీఆర్ఎస్ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ అకాల మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి,ప్రజలకు విశేష సేవలందించారని,ఆయన అకాల మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు అని ఎంపీ రవిచంద్ర తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.గోపినాథ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఎంపీ రవిచంద్ర ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం – మాజీ ఎంపీ నామ
ప్రజా తీర్పుతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు – మాజీ ఎంపీ నామ
రాజకీయాల్లో కింద స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడు గోపీనాథ్ – మాజీ ఎంపీ నామ
హాస్పిటల్ లో చేరిన సమయం లో వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని కోరుకున్న – మాజీ ఎంపీ నామ
హాస్పిటల్ నుండి కోలుకొని తిరిగి వస్తారు అనుకున్న కానీ ఇలాంటి వార్త వినడం దురదృష్టకరం – మాజీ ఎంపీ నామ
ఆయన ఆత్మకి శాంతి కలగాలి. ఇలాంటి కష్ట సమయం లో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యాన్ని అందించాలి – మాజీ ఎంపీ నామ