కాకినాడ పోర్టుకు 40 వేల టన్నుల యూరియా
ఇండోనేషియా నుంచి భారీ నౌకలో రాక.. 2 రోజుల్లో పంపిణీ
కలెక్టరేట్(కాకినాడ), సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కాకినాడ సీపోర్టుకు సోమవారం 40వేల టన్నుల యూరియా వచ్చింది.
ఇండోనేషియా నుంచి భారీ నౌకలో తీసుకొచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరతగా ఉన్న నేపథ్యంలో ఇండోనేషియా నుంచి ప్రత్యేకంగా యూరియాను దిగుమతి చేసుకున్నారు. ఖరీఫ్‌లో ప్రతి ఏటా ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి అవుతుంది. ఈ ఖరీఫ్‌లో భారీవర్షాల వల్ల పంటలు ముంపునకు గురయ్యాయి. దీంతో యూరియా అధికంగా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యూరియాను మరో రెండురోజుల్లో ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు కేటాయించే అవకాశాలున్నట్లు సీపోర్టు అధికారులు వెల్లడించారు. కేటాయింపుల అనంతరం యూరియాను ఆయా జిల్లాలకు ప్రత్యేక రైల్వే ర్యాక్‌లు, లారీల ద్వారా తరలిస్తారు.