
పంట నష్టపోయిన రైతుల వివరాలు నమోదు
సి కే న్యూస్ .చింతకాని ప్రతినిధి. జి పిచ్చయ్య.
రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన పెసర రైతులు ఆదుకోవాలని ప్రభుత్వం దృష్టి పెట్టింది, ఇందులో భాగంగా చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలో వ్యవసాయ అధికారి కళ్యాణి నష్టపోయిన పెసర రైతన్నలను కలిసి వారి పంట పొలాలో ఎంత మేరకు నష్టం జరిగిందని అడిగి తెలుసుకున్నారు… అలాగే రైతులు వద్ద నుంచి ఆధార్ కార్డ్ ,బ్యాంక్ అకౌంట్ , పాస్ బుక్స్ తీసుకున్నారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరిదు రామకృష్ణ , పర్చగని సీతయ్య, కసిమాల అశోక్, రాజశేఖర్, మోచర్ల శివ , మరియు రైతుల పాల్గొన్నారు…