
ఏసీబీకి చిక్కిన టౌన్‌ప్లానింగ్ అధికారి…
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వెంచర్‌కు అనుమతి కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
ఇప్పటికే రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న రాధాకృష్ణ.. శనివారం మరో రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఈ రోజు ఎల్లంపేట్ మున్సిపల్ పరిధి సోమారం పట్టణం గంగస్థాన్ హెచ్ఎండీఏ వెంచర్ చుట్టూ నిర్మించిన కాంపౌండ్ వాల్ ను కూల్చివేస్తామని బెదిరిస్తూ ఐదు లక్షల రూపాయల లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ డీఎస్పీ గంగాసాని శ్రీధర్ మాట్లాడుతూ.. గంగాస్తాన్ హెచ్ఎండీఏ వెంచర్ చుట్టూ నిర్మించిన కాంపౌండ్ వాల్ చిరస్థాయిగా ఉండాలంటే ఐదు లక్షల రూపాయల లంచం ఇవ్వాలని, లేకుంటే కాంపౌండ్ వాల్ ని కూల్చివేస్తామని ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధ కృష్ణారెడ్డి బెదిరించినట్లు తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు.
వెంచర్ యజమాని ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకొని మొదటగా ఒక లక్ష రూపాయలను టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధ కృష్ణారెడ్డికి ఇచ్చినట్లు, మిగతా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది.
ఈ రోజు ఉదయం 9 గంటలకు కొంపల్లి మున్సిపల్ పట్టణంలోని రాయ్ చంద్ మాల్ వద్దకు బాధితుడు మూడున్నర లక్షలు తీసుకువచ్చి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధ కృష్ణారెడ్డికి ఇవ్వగా, అతను ఎడమ చేతితో కారులోని ఫ్రంట్ బాక్స్ లో పెట్టినట్లు కెమికల్ టెస్టుల ద్వారా బయటపడిందని డీఎస్పీ తెలిపారు. రాధ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నామని ఆయన నివాసంతో పాటు వివిధ కార్యాలయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
కమిషనర్‌పై అనుమానం : ఏసీబీ
ఏసీబీ ట్రాప్ లో పట్టుబడిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధ కృష్ణారెడ్డి తో పాటు మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ ను కలిపి విచారిస్తామని ఫోన్ చేసి కార్యాలయానికి రమ్మంటే … రావడంలేదని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. అయితే ఆయనపై కూడా అనుమానం కలుగుతుందని తెలిపారు.
వెంచర్ యజమాని వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ ట్రాప్ లో పట్టుబడిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధ కృష్ణారెడ్డి పై ఎస్ నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.