
ఇసుక, మట్టి దందాలపై పెట్టిన శ్రద్ధ రోడ్లపై పెట్టాలి
ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకునే నాథుడు లేడు
ప్రాణాలు పోయే దాకా పట్టించుకోరా?
మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు
అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ములకలపల్లి మండలంలో కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో అంకంపాలెం దాటిన తరువాత అడవి నుంచి అడుగడుగున రోడ్డు గుంతలతో దర్శనం ఇవ్వడంతో గంగారం వద్ద కారు దిగి పరిశీలించి స్థానికంగా ఉన్న వారితో మాట్లాడగా నిన్ను రాత్రి కూడా ఈ గుంతల కారణంగా ప్రమాదం జరిగిందని ఎవరికి చెప్పిన పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు ఇచ్చిన(గుంతలతో సెల్ఫీ) పిలుపు మేరకు అశ్వారావుపేట మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు గుంతలతో సెల్ఫీ దిగి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక మట్టి దందాలపై పెట్టిన శ్రద్ధ రోడ్లపై పెట్టాలని.22నెలలు అవుతున్నా తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని.
కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి లేదని.ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రాణాలు పోయేదాకా చూస్తూ ఉంటారా అని మండిపడ్డారు.గత BRS ప్రభుత్వంలో పోసిన రోడ్లు తప్ప కొత్తగా ఈ 22నెలల్లో కాంగ్రెస్ చేసింది ఏమి లేదని.
BRS ప్రభుత్వంలో మంజూరై మొదలైన పనులను సైతం గాలికి వదిలేశారని.ముఖ్యమంత్రి నుంచి MLAల వరకు మళ్ళీ గెలవడం కష్టమనే విషయం తెలిసి గెలిపించిన ప్రజలు ఏమైపోతే మాకెందుకు మా కడుపులు నిండాలని అందరూ దోచుకునే పనిలో నిమగ్నమైపోయారని. వెంటనే అంకంపాలెం అడవి నుంచి ములకలపల్లి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని లేకపోతే రోడ్డు పై ధర్నాకు సిద్ధం అవుతామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు.