CK News
Breaking News
Buy Now
Date of Publish: December 16, 2025
Digital Edition: CK News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉస్మానియా వర్సిటీ డీఈఈ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉస్మానియా వర్సిటీ డీఈఈ

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో మంగళవారం (డిసెంబర్ 16) ఏసీబీ సోదాలు నిర్వహించింది.

బిల్డింగ్ డివిజన్ డీఈ శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‎గా దొరికాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరాల ప్రకారం.. ఓయూ మానేరు హాస్టల్‎లో ఓ కాంట్రాక్టర్ సివిల్ వర్క్స్ చేశాడు. రూ.14 లక్షల బిల్లుల కోసం డీఈ శ్రీనివాస్‎కు దరఖాస్తు చేసుకున్నాడు.

బిల్లులు సాంక్షన్ కావాలంటే రూ.11 వేలు లంచం ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్‎ను డీఈ శ్రీనివాస్‎ డిమాండ్ చేశాడు.

దీంతో వారం రోజుల కింద ఫోన్ పే ద్వారా రూ.5 వేలు పంపాడు కాంట్రాక్టర్. మరో రూ.6 వేల కోసం శ్రీనివాస్ డిమాండ్ చేయగా.. కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఏసీబీ సూచన మేరకు మంగళవారం (డిసెంబర్ 16) డీఈ శ్రీనివాస్‎కు రూ.6 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో రెండు నెలల్లో రిటైర్డ్ కానున్న డీఈ శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం.

Home