
ఉరేసుకునేందుకు భార్య యత్నం.. స్టూల్ తన్నేసిన భర్త
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తను బెదిరించి భార్య స్టూలెక్కి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించంది.
మద్యం మత్తులో ఉన్న భర్త స్టూలును కాలితో తన్నడంతో ఊపిరి ఆడక మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫిలింనగర్‌కు చెందిన కొండల్ కూలీగా పని చేస్తాడు. కొన్నేళ్ల క్రితం అరుణతో వివాహం అయింది. అరుణ ఓ మెడికల్ షాపులో పనిచేస్తోంది.
కాగా, కొండల్ రోజూ మద్యం తాగి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అప్పుడే విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఆగ్రహంతో కొండల్ భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో అరుణ ఆత్మహత్య చేసుకుంటానంటూ స్టూల్ వేసుకొని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీ బిగించింది. భర్తను బెదిరిద్దామని స్టూలు వేసుకొని ఉరి పెట్టుకోగా మద్యం మత్తులో ఉన్న కొండల్ స్టూల్‌ను తన్నాడు.
దీంతో అరుణ ఊపిరి ఆడక మరణించింది. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రశ్నించగా అరుణ ఆత్మహత్య చేసుకుందని కొండల్ చెప్పాడు.
అయితే మృతురాలి కుమారుడు తన తండ్రి స్టూల్ తన్నడం వల్లనే తల్లి మరణించిందని చెప్పడంతో పోలీసులు కొండల్‌ను అదుపులోకి ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



