PoliticalTelangana

మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో భారీగా చేరిన కౌన్సిలర్లు..

మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన అసమ్మతి కౌన్సిలర్లు..

బీఆర్ఎఎస్ కి బిగ్ షాక్….

కాంగ్రెస్ లో చేరిన అసమ్మతి కౌన్సిలర్లు..

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరిక

– దామన్న నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తాం

– పార్టీలో చేరిన కౌన్సిలర్ల వెల్లడి

సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ :

అంతా అనుకున్నట్టే జరిగింది టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లు బుధవారం హైదరాబాదులో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి సమక్షంలో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వంలో వారు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు

ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో అవినీతి రాజ్యమేలుందని దానికి సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పేరిట భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు

నూతనంగా పార్టీలోకి చేరిన కౌన్సిలర్లు ఇదివరకే పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో సమన్వయంతో పని చేస్తూ ప్రజా సమస్యల పై పోరాడి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు రాబోయే లోక్సభ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్లు కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి, మామిడి గౌరయ్య, ధరావత్ రవి, జాటోత్ మకట్లాల్ లక్ష్మి, ధారావత్ నీలాబాయి, కుంభం రేణుక, బచ్చల కూరి శ్రీను, ఎలిమినేటి అభినయ్,

మాలోత్ కమల,అనేపర్తి రాజేష్, చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ,రాపర్తి శ్రీనివాస్ గౌడ్,అనంతుల యాదగిరి గౌడ్,ఎస్కే జహీర్,జ్యోతి శ్రీవిద్య, గండూరి రాధిక రమేష్,నామ అరుణ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ,జిల్లా నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి, గండూరి రమేష్, కుంభం రాజేందర్, రుద్రంగి రవి, రాపర్తి సైదులు, రాపర్తి లచ్చయ్య,అనంతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button