KhammamPoliticalTelangana

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు

కుటుంబ పరిస్థితులపై ఆరా తీస్తున్న అధికారులు

సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 10 2026: ఏన్కూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

మండలంలోని ఏన్కూరు గ్రామం జంగాల కాలనీకి చెందిన ఎస్. రాజశేఖర్ (45) మంగళవారం ఉదయం తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సంధ్య తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించగా రాజశేఖర్ అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.

వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజశేఖర్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న రాజశేఖర్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

గ్రామంలో కూడా ఈ ఘటన కలకలం రేపింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కుటుంబ సభ్యులను విచారించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సంధ్య వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button