KhammamPoliticalTelangana

మెడికల్ షాప్‌లో కుప్పకూలిన వ్యక్తి…

మెడికల్ షాప్‌లో కుప్పకూలిన వ్యక్తి…

కారేపల్లి గ్రామంలో విషాదఛాయలు..

మెడికల్ షాప్‌లో కుప్పకూలిన వ్యక్తి… సీపీఆర్ చేసినా ప్రయోజనం లేదు

మూడు నెలల క్రితమే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఒక్కడే కుమారుడు. ఇంతలోనే ఆ తల్లిదండ్రులకు షాక్‌కు గురిచేసే వార్త.

ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కారేపల్లి మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్డుకు చెందిన గణపతి నారాయణ లక్ష్మీ ప్రసన్న ఏకైక కుమారుడు సాయి చంద్ర( 24) సంవత్సరాలు బీ ఫార్మసీ పూర్తి చేసి తర్వాత హైదరాబాదులో హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

ఎడమ చేయి లాగడంతో పక్కనే ఉన్న ఓ మెడికల్ షాప్‌కు వెళ్లి టాబ్లెట్లు అడిగాడు. ఇంతలోనే సాయి చంద్ర ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు.

దీంతో షాప్ సిబ్బంది సీపీఆర్ చేసినా ప్రయోజనం దక్కలేదు. ఇదంతా సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు అయ్యాయి.

కాగా ఆయన ఫోన్లో నెంబర్లు ఆధారంగా కుటుంబానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని తెల్లవారుజామున కారేపల్లికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

తండ్రి నారాయణ ఏన్కూరు మండలం వైరా నియోజకవర్గంలోని గార్ల వడ్డు లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు.

ఒక్క కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుని.. చేతికి వచ్చాడని సంతోషించే లోపే కొడుకు మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. కారేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button