Mahabub badPoliticalTelangana

టైర్ పేలి చెట్టును ఢీకొట్టిన కారు…మహిళ మృ*తి.. నలుగురికి గాయాలు

టైర్ పేలి చెట్టును ఢీకొట్టిన కారు…మహిళ మృ*తి.. నలుగురికి గాయాలు

టైర్ పేలి చెట్టును ఢీకొట్టిన కారు…మహిళ మృ*తి.. నలుగురికి గాయాలు

మహబూబాబాద్ జిల్లా
రఘునాథపల్లి : టైర్​పేలడంతో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృ*తిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

లింగాల ఘనపూర్​ ఎస్సై శ్రవణ్ తెలిపిన వివరాల ప్రకారం..జనగామ పట్టణానికి చెందిన బండి లక్ష్మి(60) కుటుంబసభ్యులతో కలిసి గురువారం బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్​కు కారులో వెళ్లింది.

తిరిగి వస్తుండగా కుందారం శివారులో ఒక్కసారిగా కారు టైర్​పేలడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి స్పాట్ లోనే చనిపోయింది.

కారు నడుపుతున్న జెన్నె శ్రీకాంత్, అతని భార్య మాధవి, సోదరి శ్రావణి, తల్లి సిద్దేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను జనగామ హాస్పిటల్ కు తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button