HealthHyderabadPoliticalTelangana

తెలంగాణ లో మరో కొత్త పథకం

తెలంగాణ లో మరో కొత్త పథకం

తెలంగాణ లో మరో కొత్త పథకం

ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నవారికి బాల భరోసా పథకం

ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ‘బాల భరోసా’ పేరుతో మరో కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతుండగా.. ఈ పథకం ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి సీతక్క.. సచివాలయంలో సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ లో వివరించారు.

ఈ పథకం ద్వారా.. ఐదేళ్ల లోపు పిల్లలకు.. అవసరమైతే ఉచితంగా శస్త్ర చికిత్సలు కూడా చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పథకం అమల్లోకి వస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారుల కుటుంబాలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంది.

నేటి వాతావరణ పరిస్థితుల వల్ల నిత్యం వందలాది మంది పిల్లలు అనారోగ్యం బారిన పడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుండడంతో.. పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పులు పాలు అవుతున్నాయని.

ఈ క్రమంలో ఐదు ఏళ్ల లోపు పిల్లలకు ప్రభుత్వం ‘బాల భరోసా’ పథకం తీసుకురావడం శుభపరిణామంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ కొత్త పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button