
పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్.. భారీగా పేస్కేల్ తగ్గింపు..!
పంచాయతీ కార్యదర్శుల విషయంలోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో గ్రేడ్-5 నుంచి గ్రేడ్-3 హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ జారీ చేసిన జీవో 91 ప్రకారం వీరికి రూ.28,280 పేస్కేల్‌ను నిర్ణయించారు.
అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరించింది. అంతేకాదు జీవో 60ని విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను రూ.28,280 నుంచి రూ.25,220కి తగ్గించింది.
పదోన్నతులు కల్పించినట్టే కల్పించి కోత. ప్రభుత్వ అకస్మాత్తు నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు కల్పించినట్టే కల్పించి, తీరా వేతనం వచ్చేసరికి కోత విధించడం అన్యాయమని వాపోతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రయోజనాలను రద్దు చేయడం వల్ల వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
జీవో 60ను ఉపసంహరించుకోవాలి.. తక్షణమే సవరించిన జీవో 60ని ఉపసంహరించుకోవాలని, పాత పేస్కేల్‌నే కొనసాగించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.




