HyderabadPoliticalTelangana

మల్లారెడ్డి మా భూములు కబ్జా చేసిండు.. బాధితుల ఆందోళన

మల్లారెడ్డి మా భూములు కబ్జా చేసిండు.. బాధితుల ఆందోళన

మల్లారెడ్డి మా భూములు కబ్జా చేసిండు.. ప్రజా భవన్ ముందు బాధితుల ఆందోళన..

ప్రజా భవన్ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో సర్వేనెంబర్ 648/650లోని తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపించారు.

ప్రజావాణిలో తమ సమస్య విన్నవించేందుకు 600 మందికి పైగా బాధితులు వచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలోని తమ భూములను మల్లారెడ్డి అప్పటి తన అధికారాన్ని ఉపయోగించి కబ్జా చేసారని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. మల్లారెడ్డి నుంచి తమ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు.

మరో వైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కాప్రా సర్వేనెంబర్ 647/1, 648& 654లో భూమిని మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ ధర్నాకు దిగారు.

సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. కాగా, ప్రజావాణికి భారీ స్పందన వస్తుంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజావాణికి భారీగా జనం తరలివచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button