EducationNationalNotificationPolitical

ఇండియన్ రైల్వేలో కొలువుల జాతర.. వారికి మంచి అవకాశం..

ఇండియన్ రైల్వేలో కొలువుల జాతర.. వారికి మంచి అవకాశం..

ఇండియన్ రైల్వేలో కొలువుల జాతర.. వారికి మంచి అవకాశం..

ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్​సీ) అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్ట్ పేరు : అసిస్టెంట్ (ఎన్ఈ5 లెవల్), అసిస్టెంట్ మేనేజర్/ ఫైనాన్స్ (ఈ1 లెవల్).
మొత్తం ఖాళీలు : 23.

విభాగాల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ (ఎన్ఈ5 లెవల్) 16. (అన్​రిజర్వ్డ్ 06, ఎస్సీ 02, ఎస్టీ 02, ఓబీసీ 04, ఈడబ్ల్యూఎస్ 02), అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) 07 (అన్​రిజర్వ్డ్ 02, ఎస్సీ 01, ఎస్టీ 01, ఓబీసీ 01, ఈడబ్ల్యూఎస్ 01).

ఎలిజిబిలిటీ .. అసిస్టెంట్ (ఎన్ఈ5 లెవల్) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో కామర్స్​లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఐసీఏఐ/ ఐసీఎంఏఐలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అసిస్టెంట్ మేనేజర్/ ఫైనాన్స్ (ఈ1 లెవల్) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో కామర్స్​లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సీఏ/ సీఎంఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్)/ పీజీడీఎం (ఫైనాన్స్) పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి : 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ : ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం : ఏప్రిల్ 4.

లాస్ట్​డేట్ : మే 1.

సెలెక్షన్ ప్రాసెస్ : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీ : జూన్ (తాత్కాలికం).

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ irfc.co.inను సందర్శించండి.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) సీబీటీలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. పార్ట్-ఏ, పార్ట్-బిలో భాగంగా 100 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.

పార్ట్ -ఏ (50 మార్కులు) : గణితం/ సంఖ్యా సామర్థ్యం (20), సాధారణ అవగాహన (10), తార్కిక విశ్లేషణ (10), రైల్వేలు/ ఐఆర్ఎఫ్​సీ గురించి పరిజ్ఞానం (10).

పార్ట్ -బి (50 మార్కులు) : సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు (కార్పొరేట్ అకౌంటింగ్, ఫైనాన్స్, టాక్సేషన్ మొదలైనవి) ఉంటాయి.

నెగిటివ్ మార్కింగ్ : తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు తగ్గిస్తారు.

అర్హత మార్కులు : అన్​రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ – 40 శాతం, ఎస్సీ/ ఓబీసీలకు 30 శాతం, ఎస్టీలకు 25 శాతం సాధించాల్సి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button