
బిర్యానీ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో బిర్యానీకి సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హోటల్ యజమానిపై కేసు.
జీడిమెట్లకు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి ఈ హోటల్‌ను నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం తయారు చేసిన బిర్యానీని స్టోర్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
సోదాల్లో ఫ్రిడ్జ్‌లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలు కూడా బయటపడటంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. అనంతరం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



