HyderabadPoliticalTelangana

మానవ హక్కుల కమిషన్ ముందు ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మ*హత్యాయత్నం

మానవ హక్కుల కమిషన్ ముందు ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మ*హత్యాయత్నం

మానవ హక్కుల కమిషన్ ముందు ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మ*హత్యాయత్నం

మహిళ కానిస్టేబుల్ నాపై నిలబడి విచక్షణారహితంగా కొట్టారు

హైద్రాబాద్ : పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని శ్రావణి తెలిపింది. నాంపల్లిలో మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట శ్రావణి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కవాడిగూడ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులో ఐదేళ్లుగా పనిచేస్తున్నానని, ఇటీవల బంగారం దొంగలింపబడిందని అపార్ట్ మెంట్ ఓనర్ ఇందిరా ప్రియదర్శిని గాంధీనగర్ పోలీసులకు తనపై ఫిర్యాదు చేసిందని,

ప్రియదర్శిని తనని కాలుతో తన్నిందని, అయితే ఆ దొంగతనం కేసులో పోలీసులు తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని, శ్రీవాణి అనే కానిస్టేబుల్ తన కాలుపై నిలబడి, భూతులు తిట్టారని పేర్కొంది.

తాను స్పృహతప్పి పడిపోయిన తరువాత తనపై నీళ్లు చల్లి, 30 సార్లు కర్రలతో కొట్టారన్నారు. దొంగతనం చేసిందని అపార్ట్ మెంట్ అంతా తన ఫోటోలను పోస్టర్లుగా అంటించారని, అందుకే ఆవేదనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు శ్రావణి తన బాధను వ్యక్తం చేసింది.

ఆమె ఆవేదన విని, వేధించడం ఆపాలని, ఈ నెల 30వ తేదీ లోపు ఈ ఘటనపై పూర్తి నివేదిక అందజేయాలని పోలీసులకు మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఆదేశించారు.

గాంధీ నగర్ పోలీసులు తనని వేధిస్తున్నారని నాంపల్లిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button