
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 3000+ జాబ్స్.. 10th, 12th, డిగ్రీ పాసైతే చాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికంగా 13 ఏప్రిల్ 2026న SSC Selection Post Phase 14 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 3003 ఖాళీలు ఉన్నాయి. ఇవి వివిధ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్లలో Group B (నాన్-గెజెటెడ్) & Group C పోస్టులు.
అర్హత ప్రమాణాలను కలిగి ఉండి, ప్రభుత్వ ఉద్యోగం ఆశించే అభ్యర్థులు, ఎస్ఎస్సి అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మే 4, 2026. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన తేదీలు : ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ- ఏప్రిల్ 13, 2026
దరఖాస్తు ఫారమ్ నింపడానికి చివరి తేదీ- మే 4, 2026
దరఖాస్తు ఫీజు సమర్పించడానికి చివరి తేదీ- మే 5, 2026
అప్లికేషన్ ఎడిట్ చేయడానికి తేదీ- మే 11 నుండి 13, 2026. CBT పరీక్ష తేదీ -జూన్ 2026
అర్హత : ఈ నియామక ప్రక్రియలో పాల్గొనడానికి, అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి/12వ తరగతి/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు.
గరిష్ట వయోపరిమితి 25/28/30 సంవత్సరాలుగా ఉంటుంది. నిబంధనల ప్రకారం, రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారికి వయోసడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 3,003 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 1,534 పోస్టులు జనరల్‌కు, 667 ఓబీసీకి, 271 ఈడబ్ల్యూఎస్‌కు, 346 ఎస్సీకి, 185 ఎస్టీకి కేటాయించారు.



