NationalPolitical

కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడిపై దాడి..!

కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడిపై దాడి..!

కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడిపై దాడి..! వీడియో వైరల్

Social media viral : దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి ఇవాళ షాక్ తగిలింది.

నీట్ పేపర్ లీక్ అయిన రాజస్తాన్ లోని జైపూర్ లో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన భారీ నిరసనలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే (Abhijeet Dipke)పై దాడి జరిగింది. అభిజిత్ ను చుట్టుముట్టిన కొందరు ఆగంతకులు చెంపదెబ్బలు కొడుతూ దాడికి పాల్పడ్డారు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు నగరాల్లో ఒకే అజెండాతో నిరసన సభలు నిర్వహిస్తున్న కాక్రోచ్ పార్టీ ఇవాళ జైపూర్ లో ఇలాంటి నిరసనే నిర్వహిస్తోంది. ఇందులో హాజరయ్యేందుకు వచ్చిన అభిజిత్ దిప్కేను ఆయన మద్దతుదారుల భుజాలపై ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు.

ఆ సమయంలో అక్కడ గుంపులోని కొందరు దుండగులు దిప్కే కండువాను లాగి, నాలుగు సార్లు చెంపదెబ్బ కొట్టి, కిందకు లాగడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

దిప్కేపై దాడి చేసిన వారిని కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button