
ఐటీ భవనంపై నుంచి దూకి ఖమ్మం జిల్లా విద్యార్థి ఆత్మహత్య!
హైదరాబాద్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాలకు చెందిన అభిరూప్గా అనే విద్యార్థి ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
దీంతో ఒక్కసారిగా క్యాంపస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టూడెంట్ రక్తపు మడుగులో విలవిల్లాడుతూ చనిపోయాడు. ఒక్కసారిగా అక్కడున్న వారు భయంతో పరుగులు పెట్టారు.
చాలాసేపు వరకు అక్కడ ఏంజరిగిందో కూడా కొంత మందికి అర్థంకాలేదు. క్యాంపస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత విద్యార్థి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు.
ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. చనిపోయిన వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం మండలంకు చెందిన అభిరూప్ ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.
గత కొంత కాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఒక వైపు చదువు ఒత్తిడి మరోవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతు ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
అసలు విద్యార్థి సూసైడ్ కు గల కారణాలు ఏంటని పోలీసులు విచారణ చేపట్టారు. చదువంటే ఒత్తిడా..?.. లేదా..మరేదైన ఉందా.?… అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.




