
మధిరలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం..
ఖమ్మం నుండి వచ్చిన క్లూస్ టీం తో కలిసి ఆధారాలను స్వీకరిస్తున్న సిఐలు మధు, రమేష్
మధిర–వైరా ప్రధాన రహదారిలోని పీవీఆర్ కళ్యాణ మండపం సమీపంలో ఈరోజు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడి ముఖం, చేతులపై రక్తపు మరకలు ఉండటంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఖమ్మం నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలను స్వీకరిస్తున్న రూరల్ సీఐ మధు, టౌన్ సీఐ రమేష్, ఎస్‌ఐ నవిత తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




