Khammam
Trending

జన్నారం క్రాస్‌రోడ్‌ వద్ద రోడ్డు ప్రమాదం

జన్నారం క్రాస్‌రోడ్‌ వద్ద రోడ్డు ప్రమాదం

జన్నారం క్రాస్‌రోడ్‌ వద్ద రోడ్డు ప్రమాదం

అశోక్‌ లేలాండ్‌ వాహనం–బైక్‌ ఢీ.. ఇద్దరికి స్వల్ప గాయాలు

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ
ఏన్కూరు సెప్టెంబర్‌ 17 2026: మండలంలోని జన్నారం క్రాస్‌రోడ్‌ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏన్కూర్ కేంద్రం వైపు నుంచి వెళ్తున్న అశోక్‌ లేలాండ్‌ వాహనం, తల్లాడ వైపు నుంచి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులకు సహాయం అందించారు. సమాచారం అందుకున్న ఏన్కూర్‌ ఎస్సై సంధ్య సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు.
గాయపడిన ఇద్దరినీ అంబులెన్స్‌ ద్వారా ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ప్రమాదానికి గల కారణాలు, వాహనాల వేగం తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button