
ఏజెన్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎస్ఐ, కానిస్టేబుల్ ఫ్రీ ట్రైనింగ్.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ట్రైబల్ శాఖ
Web desc : ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ అభ్యర్థులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చి ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (టీసీఆర్టీఐ) డైరెక్టర్ సముజ్వల ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అర్హత కలిగిన 100 మంది ఎస్టీ అభ్యర్థులను ఇంటర్, డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీరికి ఫ్రీ కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్, పరీక్షా విధానంపై అవగాహన, ఫిజికల్ ప్రాక్టీస్ టెస్టులు నిర్వహిస్తారు.
అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించరాదు. ఆసక్తి గల అభ్యర్థులు http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 9వ తేదీ వరకు అప్లికేషన్లకు గడువు ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.