
ధర్మపురంలో దళితుడు కొన్న ఇంటి భూమిపై రొoడ్ల షర్మిల రెడ్డి అనుచరుల దౌర్జన్యం
దాడి చేశారంటూ ఆరోపణ
దళిత బిడ్డ బరిగల రాజు
సి.కే న్యూస్ అక్టోబర్ 9 శుక్రవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ప్రతినిధి కమలాకర్
స్థానిక ధర్మపురం వాస్తవ్యుడు దళిత బిడ్డ బరిగల రాజు సన్నాఫ్ కొమురయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. బరిగల రాజు మాట్లాడుతూ నేను ధర్మపురంలో ఉన్న రొండ్ల సోమిరెడ్డి ,కీర్తిశేషులు ప్రతాపరెడ్డి, రొండ్ల ప్రశాంత్ రెడ్డి, కీర్తిశేషులు రాజిరెడ్డి వారి వద్ద నుండి వారికి వచ్చిన పాలు గ్రామ కంఠలోని సర్వేనెంబర్ 5 లో ఉన్న ఇంటి భూమి గంపగుత్తగా 10 గుంటల నుండి, 13 గుంటల వరకు ఉన్న ఇంటి స్థలాన్ని 10 లక్షలకు కొనుగోలు చేసి ధర్మపురంలో ఉన్న పెద్దమనుషుల సమక్షంలో 12వ తారీకు 9వ నెల 2022 సంవత్సరంలో కొనుగోలు చేసినాను.నేను ఈ భూమిని కొనుగోలు చేసినప్పుడు రొండ్ల షర్మిలారెడ్డి కూడా ఉంది, ఆమెకు ఈ కొనుగోలు విషయం తెలుసు, నా ప్రక్కకే ఆమె పాలు కూడా ఉంది,
మా ఇరువురి మధ్యలో ఎవరి పాలుకు వారము కనీలు నాటుకున్నాము నేను ఒక రూము వేస్తామని వెళ్లి సెప్టెంబర్ 19వ తారీఖున కందుకాలు తీస్తుంటే రొండ్ల షర్మిల ఆమె అనుచరులు విష్ణువర్ధన్ రెడ్డి నా మీదకు వచ్చి నీవు ఎస్సీ వాడవు నా ప్రక్కకు నీవు ఇల్లు ఎలా కడతారు అని కులం పేరుతో దూషిస్తూ నన్ను వారు కులం పేరిట మానసిక బాధకు లోన్ చేస్తూ ఉన్నారు. నేను పాదుకున్న కనీలను విరగగొట్టి నాకు ఒక 20 వేల ఆస్తి నష్టం చేసినారు.
వారి మీద నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాను, సెప్టెంబర్ 19 నుండి ఇప్పటి అక్టోబర్ 9 వరకు వారి మీద చర్యలు తీసుకోలేదు పోలీసు వారు .నా వద్ద ఇంటి స్థలం కొన్న ఒరిజినల్స్ కాగితాలు ఉన్నాయి.షర్మిల దగ్గర లేవు, నా మీద షర్మిల, విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులతో ప్రాణభయం ఉన్నది కావున నామీద దయ తలచి ఆమెపై ఆమె అనుచరులపై పోలీసు వారు తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసినదిగా పత్రిక మిత్రుల ద్వారా తెలియపరుస్తున్న నన్నారు .