
సికె.న్యూస్. ప్రతినిధి.ఆదిలాబాద్
ప్లాట్ల డబుల్ రిజిస్ట్రేషన్‌తో మోసం.. ముగ్గురి పై కేసు నమోదు
ఇప్పటికే విక్రయించిన భూమిని మరోసారి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదు
ఏ-1 రిమాండ్‌కు తరలింపు.. ఏ-2 అరెస్ట్, మరో నిందితురాలు పరారీలో
మావల ఇన్స్పెక్టర్ బేడీ ప్రేమ్ కుమార్
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని భట్టి సావర్గావ్ శివారులో ప్లాట్ల డబుల్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై మావల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా, ఏ-1ను రిమాండ్‌కు తరలించగా, ఏ-2కు అరెస్ట్. మరో నిందితురాలు పరారీలో ఉన్నట్లు మావల ఎస్హెచ్ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో భట్టి సావర్గావ్ శివారులోని సర్వే నంబర్ 52/3/1లో సంతన్న అనే వ్యక్తి నుంచి పలువురు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా ఫిర్యాదుదారుడు మహమ్మద్ సమీర్ ప్లాట్ నంబర్ 309ను 40×50 అడుగుల విస్తీర్ణంలో కొనుగోలు చేసి, డాక్యుమెంట్ నంబర్ 2719/2016 ద్వారా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
అయితే, ఇప్పటికే విక్రయించిన భూమిలోని 15 గుంటలను 2020లో ఎలాంటి సమాచారం లేకుండా రాళ్లబండి జ్యోతిర్మయి పేరుతో మరోసారి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ డబుల్ రిజిస్ట్రేషన్ కారణంగా ప్లాట్ల యజమానులు తమ స్థలాలను విక్రయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు.
ఫిర్యాదు మేరకు Cr.No. 692/2026 U/Sec. 420, 467, 468, 471 r/w 34 IPC కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ-1, ఏ-2లను 12.10.2026న అరెస్ట్ చేయగా, ఏ-1ను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఏ-2కు అరెస్ట్. ఏ-3 పరారీలో ఉన్నట్లు మావల ఎస్హెచ్ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.
నిందితుల వివరాలు:
దర్శనాల సంతన్న (63), s/o దర్శనాల సత్తెన్న, నివాసం: భట్టి సావర్గావ్, ఆదిలాబాద్. (ఏ-1: అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు)
రాళ్లబండి భగవాండ్లు (61), s/o రాళ్లబండి పోశెట్టి, నివాసం: భుక్తాపూర్, ఆదిలాబాద్. (ఏ-2: అరెస్ట్)
రాళ్లబండి జ్యోతిర్మయి. (ఏ-3: పరారీలో ఉంది)