
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
Web desc : తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు స్పీడు పెంచారు. సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్న ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఇక ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో అధికారులు ఏసీబీకి పట్టుబడటం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఏసీబీ వలకు మేడ్చల్ మల్కాజిగిరి కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి చిక్కారు. సందీప్ రెడ్డితో పాటు వీఆర్ఏ విజయ్ కుమార్, రికార్డు అసిస్టెంట్ బాలకృష్ణ రూ. 2.50 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇక ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుండగా లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు 1064 నంబర్ ను ఉపయోగించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర మండలానికి చెందిన ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమిని 22ఏలో చేర్చాలని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ అధికారులకు దర్యాప్తు చేసుకున్నాడు. అయితే పని పూర్తి కావాలంటే రూ. 5 లక్షలు లంచం ఇవ్వాలని డీటీ డిమాండ్ చేశాడు.
ఈ మేరకు విడతలవారీగా ఇచ్చేందుకు మాట్లాడుకున్నారు. అందులో భాగంగా గురువారం తొలి విడతగా రెండున్నర లక్షలను డీటీకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు సెడెన్ ఎంట్రీ ఇచ్చారు. డీటీ సందీప్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.