
అతివేగంతో అదుపుతప్పి కారు బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
Web desc : షాద్ నగర్ పట్టణ సమీపంలోని పరిగి రహదారిపై గ్రానైట్ కంపెనీ వద్ద శనివారం కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి రెండు బైకులను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందగా, బైకులపై ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు పల్టీలు కొట్టడంతో అందులో ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
బైకులపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద వివరాల పై ఆరా తీస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});