
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడి
Web desc : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
రాయదుర్గం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ యువకుడు మాయమాటలు చెప్పాడు. ఇంటి పని ఇప్పిస్తానంటూ మహిళను అతడు నమ్మించి ఆటో ఎక్కించుకున్నాడు. భర్తకు చెప్పి వస్తానన్నా వినకుండా మహిళను యువకుడు నమ్మించాడు.
ఆటోలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ – 51కు తీసుకెళ్లాడు. చెట్లు దట్టంగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను అమీర్పేట యూసీహెచ్కు తరలించారు. నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.