
మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల-1 ప్రిన్సిపాల్ సస్పెండ్..
కరీంనగర్ : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలపై, రేకుర్తి మైనారిటీ గురుకుల బాలికల-1 ప్రిన్సిపల్ మోనిక సోనీనీ సస్పెండ్ చేస్తున్నట్లు, టిజిఎమ్మారెస్ సెక్రటరీ షఫీయుల్లా బాబా ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని..
మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు చెబుతుంటే, మోనిక సోనీ మాత్రం తన మాటే వేదంగా భావించి, రేకుర్తి మైనార్టీ గురుకులంలో చదివే సుమారు 80మందికి పైగా విద్యార్ధినిలు, హాస్టల్ లో ఉన్నట్టు రికార్డులు చూపిస్తూ, హాస్టల్ లో ఉండకుండా గురుకులాల నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటి నుంచి వచ్చి డే స్కాలర్ మాదిరిగా చదువుకొని వెళ్లిపోతున్నారు. ఇలా ఒక్కరొక్కరుగా, గుట్టుగా సుమారు 80మందికి పైగా విద్యార్థినిలు డే స్కాలర్ గా మారారు.
హాస్టల్ పరిసరాల్లో పారిశుధ్యం సరిగా లేక..
ఈఅంశం ఇటీవలే జిల్లా కలెక్టర్ చిత్రా మిత్రా రేకుర్తి మైనార్టీ గురుకులం బాలికల సీవోఈని చేసిన ఆకస్మిక తనిఖీలో దృష్టికి వచ్చింది. ఈ అంశంపై కలెక్టర్, ప్రిన్సిపాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ 50మంది విద్యార్థినిలు ఇంటి నుంచి అప్పన్డ్ డౌన్ చేస్తున్నా..
వీరి ఆహారం మూడు పూటలా హాజరు వస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ఇదంతా జరుగుతున్న జిల్లా మైనార్టీ ఉన్నతాధికారులు, శాఖ విజిలెన్స్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు. ఈఅంశంపై మైనార్టీ గురుకులాల సెక్రటరీకి, హెడ్ ఆఫీస్ కు కలెక్టర్ చర్యలు కోసం నివేదిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజిస్టర్ మైంటైన్ చేస్తూ వివరాలు సరిగా నమోదు చేయకపోవడం, హాస్టల్ పరిసరాల్లో పారిశుధ్యం సరిగా లేక విద్యార్థినిలు విష జ్వరాల బారిన పడుతున్నారని, అక్కడ మురుగు నీరు, వర్షపు నిలుస్తుండడంతో డ్రెయిన్ లైన్ సమస్యను ఉన్నట్లు కలెక్టర్ తనిఖీలో గుర్తించారు.
కలెక్టర్ తనిఖీలో వెల్లడైన నివేదికపై, గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీ, విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విధి నిర్వహణలో మోనిక సోనీ విఫలమైనట్లు, కలెక్టర్ తనిఖీలో వచ్చిన అంశాలు నిజమేనని తేలింది. గురుకుల నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థినిలు డే స్కాలర్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించి, ప్రిన్సిపాల్ మోనిక సోనిపై వేటు పడింది.