HyderabadPoliticalTelangana

హనీ ట్రాప్ లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ ! మాజీ ప్రియురాలితో కలిసి హనీట్రాప్‌ దందా

హనీ ట్రాప్ లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ ! మాజీ ప్రియురాలితో కలిసి హనీట్రాప్‌ దందా

హనీ ట్రాప్ లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ ! మాజీ ప్రియురాలితో కలిసి హనీట్రాప్‌ దందా

Web desc : హైదరాబాద్ : మహిళల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు సృష్టించి..వాటి ఆధారంగా వలపు వల (హనీట్రాప్) విసురుతూ.. రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడిన సైబర్‌ నేరస్తుడు పవన్‌కుమార్‌ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.

సైబర్‌ నేరాలపై అవగాహన ఉండే ఓ ఏసీపీ, మరో ఇన్‌స్పెక్టర్‌ కూడా వలపు వలకు చిక్కారని హైదరాబాద్‌ సిటీ పోలీసులు విచారణలో గుర్తించినట్టు తెలిసింది. పవన్‌ తన మాజీ ప్రియురాలి సాయంతో ఈ వ్యవహారం నడిపారని, వెయ్యి మంది వరకు మోసపోయారని తేల్చినట్టు సమాచారం.

పవన్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో అందమైన అమ్మాయిల ఫొటోలతో 13 ఇన్‌స్టాగ్రామ్‌, 14 ఫేస్‌బుక్‌ ఖాతాలు ఓపెన్‌ చేశాడు. వాటిలో వందలాది మందికి వల విసిరాడు. అలా హనీట్రాప్‌ బారినపడినవారిలో హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలోని ఓ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ కూడా ఉన్నారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

సైబర్‌ నేరాలపై, సోషల్‌ మీడియాలో వలపు వలకు సంబంధించిన మోసాలపై అవగాహన ఉన్న పోలీసులే ఇలా హనీట్రాప్‌లో చిక్కి మోసపోవడం గమనార్హం.4 దేశాలు.. ఆరు రాష్ట్రాల్లో బాధితులు.. పవన్‌కుమార్‌ చేతిలో మోసపోయిన బాధితులు సుమారు వెయ్యి మంది వరకు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

ప్రాథమిక విచారణలో ఇప్పటివరకు 82 మంది బాధితులను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. వారి నుంచి రూ.25లక్షలు కొల్లగొట్టినట్టు తేలింది. మొత్తంగా కొల్లగొట్టిన సొత్తు రూ. కోట్లలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బాధితుల్లో దుబాయ్‌, టర్కీ, పాకిస్తాన్‌, కెనడా తదితర దేశాలకు చెందినవారితోపాటు.. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌కు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు.

పవన్‌కుమార్‌ చేతిలో మోసపోయినవారిలో వైద్యులు, లెక్చరర్లు, ప్రైవేట్‌ ఉద్యోగులు, గిగ్‌ వర్కర్లు ఉన్నారని.. తనతో పాటు చదువుకున్న స్నేహితులకు సైతం వలవేసి మోసగించాడని పోలీసులు చెబుతున్నారు.మాజీ ప్రియురాలి సహకారంతో.. బాధితుల బలహీనతలను గుర్తించి చాటింగ్‌తో లైంగిక సంభాషణల వైపు దృష్టి మళ్లించే నిందితుడు పవన్‌కుమార్‌..

కచ్చితంగా అమ్మాయి ఫోన్‌లో మాట్లాడాల్సిన అవసరం పడినప్పుడు, నిజంగానే అవతలివైపు ఉన్నది అమ్మాయేనని నమ్మించడానికి తన మాజీ ప్రియురాలిని రంగంలోకి దింపేవాడు. ఆమె సాయంతో వలపు వల విసిరేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఇలా నమ్మించిన బాధితుల నుంచి వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించేవాడు.

మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు, యువతుల నగ్న చిత్రాలు, వీడియోలను బాధితులకు పంపేవాడు. ఆ తర్వాత చాటింగ్‌ చేసిన యువతి సోదరుడినంటూ బాఽధితులకు ఫోన్‌ చేసేవాడు. ఫొటోలు, వీడియోలు బయటపెడతానని, తన సోదరి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయిస్తానని బెదిరించి.. వసూళ్లకు పాల్పడేవాడని పోలీసులు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button