
కూసుమంచి హైవేపై ప్రమాదంలో హట్యా తండా యువకుడి మృ*తి
కూసుమంచి : ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం అర్థరాత్రిఅన్నపూర్ణ దాబా హోటల్ సమీపాన డీసీఎం వ్యాన్ ట్రాక్టర్ ను ఢీ కొట్టడంతో మండలంలోని హట్యా తండాకు చెందిన యువకుడు గుగులోత్.సురేష్( 27) మృతి చెందాడు.
మృతుడు కి భార్య స్పందన 14 నెలలపాప ఆరునెలలబాబు కలరు. మృతుడు సురేష్ కూలీ పనుల మీద జీవనము సాగిస్తుండగా అతని సంపాదన మీదనే తల్లి కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది.కాగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});