
పెనుగోలు ఆదివాసీల భూములకు పట్టాలు జారీ చేయాలి…
అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందించిన.. ఆదివాసీ జాక్ నాయకులు…
ఆదివాసీల భూములు ప్రాజెక్ట్ లకు ఇస్తే ఊరుకునేది లేదన్న ఆదివాసీ నాయకులు…
పెసా గ్రామసభ ల ఆమోదం లేకుండా భూ సేకరణ చేయరాదు..
గిరిజనేతరుల కబ్జాలో ఉన్న భూములు ప్రాజెక్ట్ లకు ఇవ్వండి…
సి కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
రాష్ట్ర ప్రభుత్వం వందల ఏళ్లుగా సాగులో ఉన్న వాజేడు మండల పెనుగోలు ఆదివాసీలకు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఆ భూములను మోడీ కుంట ప్రాజెక్ట్ కు ఇస్తాం అంటే ఊరుకునేది లేదని ఆదివాసీ సంఘాల జాక్ నాయకులు పూనెం సాయి, కొర్స నర్సింహా మూర్తి, యాసం రాజు, వాసం నాగరాజు లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం వీర భద్రవరం లో అదనపు జిల్లా కలెక్టర్ కలెక్టర్ మహేందర్ జీ కి వినతిపత్రం అందజేశారు. వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఆదివాసీ రైతులు కూడా ఆయనను కలవడం జరిగింది. ఆధునిక ప్రపంచానికి 20 కిలోమీటర్ల దూరం లో గుట్టల మధ్య పెనుగోలు గ్రామం ఉందన్నారు. వందల ఏళ్ల నుండి అడవిని గుట్టలను నమ్ముకొని వాళ్లకున్న భూములను సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారని అన్నారు. వందల ఏళ్లుగా సాగులో ఉన్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా, వాళ్ళను కనీసం మనుషులుగా కూడా నాటి, నేటి పాలకులు చూడలేదు అన్నారు.విద్యకు, వైద్యానికి దూరంగా ఉన్నప్పుడు గుర్తులేని ఈ గ్రామం ఇప్పుడు ప్రభుత్వానికి గుర్తు వచ్చిందా అని మహేందర్ జీ ని నిలదీశారు. 1/59,1/70 పెసా వంటి రాజ్యాంగ బద్ద మైన చట్టాలను గౌరవించకుండా రెవిన్యూ ఉద్యోగులు తమ ఇష్టాను సారంగా ఆదివాసీల భూములను, ప్రభుత్వ భూములను ఇతర ప్రభుత్వ శాఖలకు కేటాయించడం సరికాదు అని నాయకులు అన్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించిన వలస గిరిజనేతరుల దెగ్గర ఉన్న ప్రభుత్వ భూములను ప్రాజెక్ట్ లకు కేటాయించాలని నాయకులు వినతిపత్రం లో పేర్కొనట్టు తెలిపారు. అమాయకులు అయిన ఆదివాసీల సాగు భూములను తీసుకుంటే ప్రత్యక్ష ఉద్యమాలు చెప్పడతామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన రెవిన్యూ భూముల రీ సర్వే లో గిరిజనతరుల ప్రభుత్వ భూములను స్వాదినం చేసుకోవాలని మహేందర్ జీ ని కోరినారు. పెసా గ్రామసభలు పెట్టకుండా ప్రాజెక్ట్ లకు సి ఏ భూములు తీసుకోవడం రాజ్యాంగ దిక్కరణ అవుతుందన్నారు. పామునూరు, డోలి, జెల్లా, చెలిమల గ్రామాలకు రోడ్డు మార్గం వేసినట్టు, పెనుగోలు గ్రామానికి రోడ్డు మార్గం వెయ్యాలని, పాఠశాల కూడా ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ ని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు పూనెం ప్రతాప్, ఎట్టి విద్యాసాగర్, కుంజ మహేష్, కంతి వెంకట కృష్ణ, కంతి విజయ్, పాయం అజయ్, వాసం నారాయణ, మహిళా నాయకులు ముర్రం రామలక్ష్మి, పద్మ, చిలకమ్మ, పెనుగోలు గ్రామ ఆదివాసీలు పాల్గొన్నారు.