
గూడూరులో మామిడి చెట్ల అక్రమ నరికివేత నలుగురు ఫారెస్ట్ సిబ్బంది సస్పెన్షన్!
సికె న్యూస్ నవంబర్ 5మహబూబాబాద్ జిల్లా (పతినిధి:మురళి
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పరిధిలో అక్రమంగా మామిడి చెట్లను నరికివేసిన వ్యవహారం ఫారెస్ట్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ శాఖ ఉన్నతాధికారులు నలుగురు కింది స్థాయి ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేశారు
అయితే, అసలు నిందితులను తప్పించి కేవలం కింది స్థాయి సిబ్బందిపైనే చర్యలు తీసుకోవడంపై స్థానికులు, అటవీ శాఖ ఉద్యోగులలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే గూడూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మామిడి చెట్లను అక్రమంగా నరికివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు, విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో నలుగురు కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పైస్థాయి అధికారుల పాత్రపై ఆరోపణలు… ఉన్నతాధికారుల సస్పెన్షన్ వేటుపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున చెట్ల నరికివేత జరుగుతున్నా పైస్థాయి అధికారులకు తెలియకుండా ఉండే అవకాశం లేదని, వారి అండదండలతోనే ఈ దందా సాగిందని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నిజమైన సూత్రధారులైన ఉన్నతాధికారులను విచారించకుండా, కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులను చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు