
మదర్సాలో బాలుడిపై లైంగిక వేధింపులు.. మౌల్సాబ్పై పోక్సో కేసు!
Web desc : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగుచూసింది. ఓ మదర్సాలో విద్యనభ్యసిస్తున్న 11 ఏళ్ల మైనర్ బాలుడిపై అరబిక్ బోధించే మౌల్సాబ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధిత బాలుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మగూడ ఫాతిమా మసీదు మొదటి అంతస్తులో బాబా షరీఫుద్దీన్ మదర్సా కొనసాగుతోంది. అక్కడ చదువుకుంటున్న 11 ఏళ్ల బాలుడు తరగతులు ముగించుకుని ఇంటికి బయలుదేరగా, అరబిక్ బోధించే మౌల్సాబ్ ఆ బాలుడిని తిరిగి పై అంతస్తుకు పిలిచాడు.
అనంతరం మసీదు ఇన్చార్జ్ అబ్బాస్ గదిలోకి తీసుకెళ్లి, మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూపించాడు. ఆ తర్వాత బాలుడి పట్ల తీవ్ర అసభ్యంగా ప్రవర్తిస్తూ, ప్రైవేట్ భాగాలను తాకి లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాలుడిని బెదిరించాడు. పోలీసుల దర్యాప్తు – పోక్సో చట్టం కింద కేసు:
భయాందోళనకు గురైన బాలుడు ఇంటికి చేరి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తల్లిదండ్రుల విచారణలో నిందితుడిని మాసి హుజ్జామాగా గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు మాదన్నపేట పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 127(2), 351(2)లతో పాటు పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్లు 8, 10 కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలుడి అధికారిక వాంగ్మూలం నమోదు చేసేందుకు ప్రత్యేక భరోసా కేంద్రానికి తరలించి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.