
మా గ్రామానికి రోడ్డు, పాఠశాల, హెల్త్ సబ్ సెంటర్ ఇవ్వండి..
“మోడీకుంట ప్రాజెక్ట్ కు పెనుగోలు ఆదివాసీల భూములు తీసుకోవొద్దు..”
“ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి తో కలెక్టర్ ని కలిసిన ఆదివాసీలు..”
“కర్రేగుట్టలకు రోడ్డు వేసినట్టే పెనుగోలు గ్రామానికి రోడ్డు వేయండి..”
“మా భూములకు పట్టాలు ఇవ్వండి.”
₹కర్రేగుట్టల భూములకు అసలైన యజమానులు ఆదివాసీలే.”
“కలెక్టర్ కు వివరించిన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి..”
“ప్రపంచ పటం లో పెనుగోలు గానికి చోటు కల్పించండి.”
“వెంకటాపురం సికె న్యూస్ ప్రతినిధి ముల్తాని.”
రెవిన్యూ అధికారులు కలెక్టర్ ఆదేశాలు లేకుండా, పెసా గ్రామసభలు పెట్టకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా మోడీకుంట ప్రాజెక్ట్ పేరుతో అక్రమంగా భూములు తీసుకుంటున్నారని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు నర్సింహా మూర్తి జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్ఖడే కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. గురువారం నర్సింహా మూర్తి పెనుగోలు రైతులతో కలెక్టర్ ను కలిసి వారి సమస్యలు వివరించినట్టు తెలియజేసారు.
శాతాబ్దాలు పెనుగోలు గ్రామం లో ఆదివాసీలు అక్కడే ఉంటున్నట్టు కలెక్టర్ కు తెలిపారు. వారసత్వ భూములు ఉన్నాయని అన్నారు. స్వతంత్ర వచ్చి ఎనభై ఏళ్ళు అయినా ఈ గ్రామాన్ని గత పాలకులు నేటి పాలకులు గుర్తించలేదని అన్నారు. విద్య, వైద్యం అందలేదన్నారు. విద్య అందక ఎంతోమంది ఆదివాసీలు అజ్ఞానం లో బ్రతుకు తున్నారని అన్నారు. వైద్యం అందక వండలమంది అకాల మరణం చెందినట్టు కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెనుగోలు ఆదివాసీలకు అందడం లేదన్నారు. అడవులను, కొందలను నమ్ముకొని వాళ్ళు అక్కడ బతుకు తున్నారని, ప్రభుత్వాన్ని నమ్ముకొని కాదని నర్సింహా మూర్తి అన్నారు. ఎనభై ఏళ్ల తర్వాత మోడీ కుంట ప్రాజెక్ట్ కు భూములు కావాలని ఆదివాసీల సాగు భూములు లాక్కొవాలని వాజేడు రెవిన్యూ అధికారులు రహస్య సర్వేలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
షెడ్యూల్ ఏరియాలో పెసా, 1/70, అటవీ హక్కుల గుర్తింపు చట్టాలను లెక్క చేయకుండా వాజేడు మండల రెవిన్యూ అధికారులు నియంతల వలె వ్యవహారిస్తున్నట్టు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పెనుగోలు గ్రామ ఆదివాసీల భూములకు రెవిన్యూ పట్టాల తోపాటు, పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేయాలనీ, పెనుగోలు గ్రామానికి రోడ్డు మార్గం వేయాలని, విద్యార్థులకు విద్య అందించాలి, వైద్య సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ను కోరినట్టు నర్సింహా మూర్తి తెలిపారు.
పామునూరు, జెల్లా, డోలి, చెలిమల, తడపల, ముకునూరు గ్రామాలకు రెవిన్యూ, పోడు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ ను కోరినట్టు ఆయన తెలిపారు…త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, పెనుగోలు ఆదివాసీల భూములు తీసుకోకుండా చూస్తానని కలెక్టర్ హేమంత్ బోర్ఖడే హామీ ఇచ్చినట్టు నర్సింహా మూర్తి మీడియా కు తెలిపారు..
కార్యక్రమం ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్, సామాజిక మాధ్యమ రాష్ట్ర అధికార ప్రతినిధి పాయం అజయ్, మహిళనాయకులు ముర్రం రామలక్ష్మి, పద్మ, రైతులు పాయం శివాజి, బొగ్గుల నారాయణ, ఉయిక సురేష్, ఉయిక గోపాల కృష్ణ, ఉయిక రాజేష్ తదితరులు పాల్గొన్నారు..