
రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్పోర్ట్స్ అధికారి, కంప్యూటర్ ఆపరేటర్!
Web desc : మహబూబ్ నగర్ జిల్లాలో మరో అవినీతి అధికారి, కంప్యూటర్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎందుకు సంబంధించి ఏసీబీ మహబూబ్ నగర్ డి.ఎస్.పి బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ కు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ కు రూ.మూడు లక్షల విలువైన బిల్లులు చేయవలసి ఉంది. అందుకుగాను యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి లంచం డిమాండ్ చేశాడు.
ఆ కాంట్రాక్టర్ ఎంతగా విజ్ఞప్తి చేసిన డిమాండ్ చేసినంత లంచం ఇవ్వాలని డిప్యూటీ అండ్ ఎస్ ఓ డిమాండ్ చేశాడు. దీనితో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించి తన గోడును వెల్లబోసుకున్నాడు. దీనితో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి గురువారం బలపన్నారు.
మహబూబ్ నగర్ పట్టణం క్లాక్ టవర్ సమీపంలో ఒక హోటల్లో భోజనం చేసిన తర్వాత కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు తీసుకోగా డిప్యూటీ అండ్ ఎస్ ఓ, కంప్యూటర్ ఆపరేటర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.