
వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడి!
Web desc : ప్రగతినగర్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కేంద్రంగా గత కొంతకాలంగా సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు గుట్టురట్టు చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జూడియో షాపింగ్ మాల్ వెనుక ఉన్న ప్రకాష్ ప్రైడ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 207లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో బుధవారం రాత్రి ఏహెచ్ టీయూ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించారు.
ఈ తనిఖీల్లో విజయవాడకు చెందిన తూము కిరణ్. అతని భార్య దుర్గాభవానితో పాటు ఓ బాధిత మహిళ, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్యాభర్తలపై పీటా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.
నివాస అపార్ట్మెంట్లలో ఇలాంటి కార్యకలాపాలు వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఇటువంటి కార్యకలాపాలపై పోలీసులు నిగా పెట్టాలని కోరుతున్న స్థానికులు.