
మున్సిపల్ కార్యాలయం ఎదుట కౌన్సిలర్ వినూత్న నిరసన…
Web desc : ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ కౌన్సిలర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత 8 రోజులుగా తన వార్డులో డోర్-టు-డోర్ చెత్త సేకరణ వాహనాలు రాకపోవడంతో, అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆయన ఈ ఆందోళన చేపట్టారు.
8 రోజులుగా వార్డులో చెత్త బండ్లు తిరగకపోవడంతో ఇళ్ల మధ్య చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ జిశాన్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వెనుక వాటర్ ట్యాంక్ వద్ద సుమారు 10 నుండి 15 చెత్త సేకరణ వాహనాలు మరమ్మతులకు గురై పడి ఉన్నాయని, వాటిని రిపేరు చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
లెబర్లు, జవాన్లు, ఎస్ఐలు, ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టేసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారుల తీరుతో విసిగిపోయిన కౌన్సిలర్, తానే స్వయంగా తన వార్డులో డోర్-టు-డోర్ తిరిగి చెత్తను సేకరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట పోసి నిరసన వ్యక్తం తెలిపారు అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.