
సైలెన్సర్ తొలగించి బుల్లెట్‌పై హల్చల్.. ఇద్దరిపై కేసు నమోదు
అతివేగం, ప్రమాదకర డ్రైవింగ్‌తో ప్రజలకు ఇబ్బందులు – మోటార్ సైకిల్ సీజ్ చేసిన వలిగొండ పోలీసులు…
సీకే న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు నవంబర్ ఆరు.
యాదాద్రి బోనగిరి జిల్లా
వలిగొండ, నవంబర్ 5: పట్టణంలో సైలెన్సర్ తొలగించి అధిక శబ్దాలు చేస్తూ, అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా మోటార్ సైకిల్ నడిపిన ఇద్దరు వ్యక్తులపై వలిగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్‌కు సైలెన్సర్ తొలగించి అధిక శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా వాహనాన్ని నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను సీజ్ చేశారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం సీజ్ చేసిన వాహనాన్ని గౌరవ న్యాయస్థానంలో డిపాజిట్ చేసినట్లు ఎస్ఐ వలిగొండ తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ప్రజా శాంతికి భంగం కలిగించేలా, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.