
యువతిపై అత్యాచారయత్నం.. కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేస్తానంటూ బెదిరింపు!
Web desc : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి, కాళ్లు, చేతులు కట్టేసి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు సమాచారం.
బాధితురాలు ప్రతిఘటించడంతో పగిలిన బాటిల్తో చంపేస్తానని బెదిరించినట్లు తెలిసింది.
దుండిగల్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. కాగా, కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు గత ఆరు నెలలుగా అదే ఇంటి పక్క పోర్షన్లో ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యువతిపై కన్నేసిన సదరు వ్యక్తి అదును కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం.
బాధితురాలి పెద్ద కుమార్తె ఇటీవల ప్రసవించడంతో ఆమె తల్లి ప్రతిరోజూ పక్క గ్రామంలోని కుమార్తె వద్దకు వెళ్తోంది. ఈ విషయాన్ని గమనించిన నిందితుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిని తన గదిలోకి బలవంతంగా లాక్కెళ్లినట్లు సమాచారం. అనంతరం కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి, పగిలిన బాటిల్తో బెదిరించినట్లు తెలిసింది.
అదే సమయంలో అటుగా వచ్చిన యువతి మేనత్త ఈ ఘటనను గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
గ్రామస్తులు నిందితుడిని ప్రశ్నించే సమయంలో వారిపై కూడా తిరగబడినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా అతని కారు తన వద్ద లేకపోవడం, ముందస్తు ప్రణాళికతోనే ఈ ఘటనకు పాల్పడేందుకు ప్రయత్నించాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.